![]() |
![]() |

మూవీ ఇండస్ట్రీ అంటేనే రంగురంగుల జీవితం..ఎప్పుడు ఎవరి జీవితాల్లో రంగులు నిండుతాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు ఆరిపోతాయో ఎవరికీ తెలీదు. ఒక వెలుగు వెలిగి మాయమైపోయిన వాళ్ళు ఇక్కడ లెక్కకు మించి కనిపిస్తారు. కొంతమంది దీనస్థితిలో తినడానికి కూడా తిండి లేని స్థాయికి వెళ్ళిపోయి నిరాశగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి ఒకరు. పాకీజా పేరు వినగానే మోహన్ బాబు సినిమా గుర్తొస్తుంది. పాకీజా అసలు పేరు వాసుకి. ఈమె తమిళనాడు కారైకుడికి చెందిన నటి.
ఇప్పుడు ఆమె వయసు పైబడడంతో పాటు పేదరికంతో ఓ హాస్టల్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగులో దాదాపు 50, తమిళ్‌తో కలుపుకుంటే 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో "అసెంబ్లీ రౌడీ" మూవీలో వేసిన పాకీజా రోల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా సినిమాలలో ఆమె నటించింది. పాకీజా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ఆస్తిపాస్తులు మాత్రం ఏమి వెనకేసుకోలేదట. వాళ్ళ అమ్మ కాన్సర్ తో మరణించారని చెప్పింది.
అలాగే తనకు షుగర్ ఎటాక్ అయ్యిందని అలాగే యుటిరస్ కూడా తొలగించాల్సి వచ్చిందని తన కష్టాలు చెప్పుకొచ్చారు. తెలుగులో తన బెస్ట్ ఫ్రెండ్ అంటే జయలలిత అని చెప్పారు. హెల్ప్ కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలను సంప్రదించాను అని వివరించారు. ఆఖరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కూడా తన పరిస్థిని వివరించామన్నారు. కానీ తనకు ఎవరూ హెల్ప్ చేయలేదు చాలా బాధపడ్డారు.
![]() |
![]() |